26 May, 2026 | 5:36 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

‘పిఠాపురంలో’ పట్టుకో బాబా

03-04-2026 12:00 AM

సీనియర్ దర్శకులు మహేశ్‌చంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘పిఠాపురంలో అలా మొదలైంది’ చిత్రం ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణ, సన్నీ అఖిల్, విరాట్, సాయిప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇందులో ప్రధాన తారాగణం. దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేశ్ పటేల్, ఎఫ్‌ఎం మురళి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీరామ్ తపస్వి రాసిన ‘పట్టుకో బాబా’ పాటను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించి, టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.