3 April, 2026 | 3:12 AM

తిమ్మరాజుపల్లి టీవీ ఓవర్సీస్ హక్కులు వాళ్లకే!

03-04-2026 12:00 AM

సుమైర స్టూడియోస్‌తో కలిసి హీ రో కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. తేజ వే ల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తు న్నారు. ఈ చిత్రంతో సాయితేజ్, వేద జలంధర్ హీరోహీరోయిన్లుగా వెండితెరపై ఎంట్రీ ఇస్తుండగా, వీ మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ, లతీశ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 17న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్, వైబ్రెంట్ మూవీస్ దక్కించుకున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: వంశీకాంత్ రేఖన; డీవోపీ: అక్షయ్ రామ్ పొదిశెట్టి; ఆర్ట్: సుధీర్ మాచర్ల.