2 April, 2026 | 3:16 AM

కథకు వారధి లాంటి పాత్ర నాది!

02-04-2026 12:00 AM

శర్వా హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటోక్రాస్ డ్రామాగా రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్ కాగా, రాజశేఖర్ ఓ కీలక పాత్రను పోషించారు. ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా విశేషాలను కథానాయకి మాళవిక నాయర్ విలేకరులతో పంచుకున్నారు.  

2024 ఏప్రిల్‌లో కథ విన్నా. చాలా నచ్చింది. దర్శకుడు అభిలాష్ చాలా ఫ్రెష్ కంటెం ట్ ఉన్న క్యారెక్టర్ రాశారు. చాలా క్లారిటీతో ఉండే డైరెక్టర్. అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తిచేస్తారు. మంచి లీడర్ కూడా.  

నా క్యారెక్టర్ గురించి ఎక్కువగా రివీల్ చేయకూడదు. ఇందులో నా పాత్ర కథకు బ్రిడ్జ్‌గా ఉంటుంది. ఒక స్పోర్ట్స్ మెన్ జీవితంలో ఫ్యామిలీ రోల్ చాలా కీలకం. ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఏ నిర్ణయం అయినా కలిసి తీసుకుంటారు. కథ మూడు టైమ్‌లైన్లలో సాగుతుంది. నా పాత్ర కూడా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న మంచి ప్రభావవంతమైన రోల్ చేశా. 

రియల్ లైఫ్‌లో నేనూ, శర్వా ఇంట్రోవర్ట్స్. పెద్దగా మాట్లాడుకోం. కానీ సినిమాలో క్యారెక్టర్ల పరంగా మంచి కెమిస్ట్రీ కుదిరింది. శర్వా చాలా స్పాంటేనియస్‌గా ఉంటారు. ప్రమోషన్స్‌లో ఇంకా బాగా ఇంటరాక్ట్ అయ్యాం.

సినిమాలో మంచి డ్యాన్స్ నంబర్స్ ఉంటాయి. ఇందులో ప్రెట్టీ బేబీ సాంగ్ ఉంది. శేఖర్ మాస్టర్ చాలా బ్యూటిఫుల్‌గా కొరియోగ్రఫీ చేశారు. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. 

రాజశేఖర్‌తో నాకు కాంబో సీన్స్ ఉన్నాయి. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవం. అంత సీనియర్ అయినప్పటికీ సెట్లో అందరితో చాలా క్లోజ్‌గా ఉంటారు. మనం ఏదైనా చెబితే వింటారు. అది చాలా గొప్ప గుణం. 

నాకు ప్రతిసారి కొత్త క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. డిఫరెంట్ లేయర్స్ ఉన్న పాత్రలు చేయాలని అనుకుంటా. అలాంటి పాత్రలు వస్తే ఖచ్చితంగా చేస్తా. ఒక క్యారెక్టర్ చేసే ముందు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుంటా. మనం సినిమాలు చేస్తున్నదే వాళ్ల కోసం. అలాగే ఆ క్యారెక్టర్ నాకు పర్సనల్‌గా కనెక్ట్ అవుతుందా లేదా.. చూసుకుంటా. ఖచ్చితంగా కొత్తగా అనిపిస్తే చేస్తా. ఇప్పటివరకు నా జర్నీ పట్ల చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నా.