8 March, 2026 | 2:52 AM

రపప్పా.. రపప్పా..

08-03-2026 01:07 AM

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం ‘రాకాస’. దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించారు. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేశ్‌కుమార్ బన్సాల్, నిహారిక కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, రోహన్ (నైంటీస్) తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది.

ఈ క్రమంలో ఈ మూవీ టీమ్ తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. ‘రపప్పా.. రపప్పా’ అంటూ సాగే పాటను శనివారం విడుదల చేశారు. హీరోయిన్ పట్ల హీరోకి ఉన్న ప్రేమ, తనకు బదులుగా వేరేవాడ్ని పెళ్లి చేసుకుంటున్న తరుణంలో హీరోయిన్ గురించి హీరో చెప్పడం, తన బాధను వివరించడం ఈ పాటలో కనిపిస్తోంది. అనుదీప్ దేవ్ అందించిన బాణీ, రఘురాం సాహిత్యం, రామ్ మిర్యాల గాత్రం ఈ పాటను మరింత ప్రత్యేకంగా మార్చేశాయి. ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్; సినిమాటోగ్రాఫర్: రాజు ఎదురోలు; యాక్షన్: విజయ్; ఎడిటర్: అన్వర్ అలీ; ఆర్ట్: పుల్ల విష్ణువర్ధన్; అడిషన్ స్క్రీన్‌ప్లే: మహేశ్ ఉప్పాల; కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మానస శర్మ.