26 April, 2026 | 6:31 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

రాష్ట్రపతి పురస్కారాన్ని గెలుచుకున్న సినిమా

19-03-2025 12:00 AM

‘బంగారు పాప’ చిత్రం 19 మార్చి 1955లో విడుదలైంది. ఈ సినిమాలో ఎస్వీ రంగారావు, జగ్గయ్య, కృష్ణకుమారి, జమున ప్రధాన పాత్రల్లో నటించారు. వాహిని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బీఎన్‌రెడ్డి నిర్మించి దర్శకత్వం వహించారు. 3వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో ‘బంగారు పాప’ తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా రాష్ట్రపతి రజత పతకాన్ని గెలుచుకుంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కోటయ్య (ఎస్వీ రంగారావు) చాలా మంచివాడు. ఆయన రామి అనే యువతిని వివాహం చేసుకుంటాడు. ఆమె గోపాలస్వామి అనే వ్యక్తి ఒత్తిడికి లొంగి భర్తను వదిలి అతనితో పారిపోతుంది.

ఆ తరువాత రామి, గోపాలస్వామి ప్లాన్ చేసి కోటయ్యను జైలుకు పంపుతారు. కోటయ్య జైలు నుంచి తిరిగొచ్చాక ఒక రౌడీగానూ.. తాగుబోతుగానూ మారతాడు. గోపాల స్వామిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. దీన్ని అమలు చేయాలని అనుకుంటుండగా ఒక చిన్న పాప ఏడుపు వినిపిస్తుంది.

దీంతో అతని మానవత్వం ప్రతీకార దాహాన్ని అధిగమిస్తుంది.  పాపను చూసుకుంటూ కొత్త జీవితాన్ని ఆరంభిస్తాడు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అసలు ఆ పాప ఎవరు? వంటి ఆసక్తికర అంశాలతో సినిమా రూపొందింది.