ముత్యాలమ్మ సన్నిధిలో మంత్రి పొంగులేటి
- బోదులబండలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న శీనన్న
- అమ్మవారికి ప్రత్యేక పూజలు.. అర్చకుల వేదాశీర్వచనం
- భక్తులకు స్వయంగా వడ్డించి.. మహా అన్నదానాన్ని ప్రారంభించిన మంత్రి
ఖమ్మం (నేలకొండపల్లి), జులై 5(విజయక్రాంతి): జననేత పొంగులేటి శీనన్న రాకతో నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామం రాజకీయ, ఆధ్యాత్మిక కోలాహలంగా మారింది. గ్రామంలో ఆదివారం కనులపండువగా నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంగళవాయిద్యాల మోతలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ ఆలయానికి చేరుకున్న మంత్రి పొంగులేటి.. అమ్మవారి దివ్య స్వరూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగ ణంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదాన వితరణను ఆయన ఘనంగా ప్రారంభించి, స్వయంగా వడ్డించి అందరినీ ఆకట్టుకున్నారు.- రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలిపూజల అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అర్చకులు వేదాశీర్వ చనం అందించి, తీర్థప్రసాదాలను బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలు ప్రజల మధ్య ఐక్యతను, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయన్నారు.
ముత్యాలమ్మ అమ్మవారి కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి తెలంగాణ పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతా ల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.






