03-02-2026 12:00:00 AM
భద్రాచలం, ఫిబ్రవరి 2, (విజయక్రాంతి) : భద్రాచలం గ్రామపంచాయతీ నిధులతో భగవాన్ దాస్ కాలనీ పరిధిలో రూ 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజ్ పనులకు భద్రాచలం శాసనసభ్యులు తేల్లం వెంకట్రావు, సర్పంచ్ పూనం కృష్ణ లు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. కార్యక్రమంలో భద్రాచలం గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, ఉప సర్పంచ్ రత్నం కవిత,
బుడగం శ్రీనివాస్, రత్న రమాకాంత్, భీమవరపు వెంకటరెడ్డి, చింతిరాల రవికుమార్, నవాబ్, నర్రా రాము, సరేళ్ళ నరేష్, జిందా, లకవత్ వెంకటేశ్వర్లు, నాగేంద్ర, పడిసిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భద్రాచలం పట్టణంలో డ్రైనేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ పనులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.