03-02-2026 12:00:00 AM
మణుగూరు, ఫిబ్రవరి 2, (విజయక్రాంతి) : గుట్ట మల్లారంలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన విద్యుత్ శాఖ ఏడిఈ కార్యాలయ నూతన భవనాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన విద్యుత్ అందించడం జరు గుతుందన్నారు.
అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. విద్యుత్ అధికారులకు ఎటువంటి సమస్యలున్న తెలియజేసి పరిష్కరించుకోవచ్చునన్నారు. ఎక్కడ లో వోల్టేజ్ సమస్య ఫిర్యాదులు రాకూడదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కారం పూజిత, విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రిసిటీ) మహేందర్, డీఈ జీవన్ కుమార్, ఎస్‌ఏఓ శ్రీధర్ , ఏడీఈ ఉమా మహేశ్వర్ రావు, ఏఏఓ సత్యనారాయణ, మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పిరినాకి నవీన్, శివ సైదులు, కూచిపూడి బాబు, తరుణ్ రెడ్డి, పోలమూరి రాజు పాల్గొన్నారు.