calender_icon.png 3 February, 2026 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేగా కాంతారావు..నోరు అదుపులో పెట్టుకో..

03-02-2026 12:00:00 AM

బూర్గంపాడు, ఫిబ్రవరి2, (విజయక్రాంతి): పినపాక మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు ఆదివారం మణుగూరు పట్టణంలో నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు పై నోటి దురుసు మాటలకు బూర్గంపాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. మండల కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు.

కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బిఆర్‌ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన రేగా కాంతారావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేనిపక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీకే మోసం చేసిన ఘనత రేగా కాంతారావుదని దుయ్యబట్టారు. అనంతరం పినపాక బి బ్లాక్ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బర్ల నాగమణి మాట్లాడుతూ మతిభ్రమించి రేగా కాంతారావు మాట్లాడుతున్నాడని కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీని కాలుతో తన్ని బిఆర్‌ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన వ్యక్తి ఇప్పుడు నీతులు మాట్లాడడం అవివేకమని అన్నారు. నోరు ఉందని కాంగ్రెస్ నాయకులను బూతులు తిడితే చూస్తూ ఊరుకోమని మహిళా కాంగ్రెస్ నాయకులు చీపుర్లతో తరిమి తరిమి కొడతారని మండిపడ్డారు.

రేగా కాంతారావు బిఆర్‌ఎస్ పార్టీలో చేరి కబ్జాలు, అక్రమాలు అవినీతి సంపదతో విర్రవీగుతున్నామని కాంగ్రెస్ పార్టీ తో పెట్టుకుంటే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నోటి దురుసు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో  బూర్గంపాడు సర్పంచ్ మంద నాగరాజు,మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మండల మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుగుణ, జిల్లా మహిళా నాయకురాలు బోడ దివ్య, ఇందిరమ్మ కమిటీ మెంబర్ చోటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కైపు శ్రీనివాసరెడ్డి,భజన ప్రసాద్,మహమ్మద్ పాషా,హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.