1 April, 2026 | 2:35 AM

ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళల ఆర్థిక స్వావలంబనకు బలమైన అడుగు

01-04-2026 12:12 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, మార్చి 31 (విజయక్రాంతి) : ఉచిత బస్సు పథకం మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు, స్వావలంబనకు భరోసా, బలమైన అడుగు అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్ లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత  బస్సులో రూ.10వేల  కోట్ల ఆదా చేసిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించున  కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

జిల్లాలో మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం వల్ల భారీ స్థాయిలో ఆర్థిక ఆదా జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, ఆర్డీవో వేణు మాధవ రావు, ఆర్టీసీ డిప్యూటీ అర్‌ఎం సూచరిత, అడిషనల్ డీఆర్డీవో సురేష్, సూర్యాపేట ఆర్టీసీ డిఎం సునీత, కౌన్సిలర్ అరుణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.