calender_icon.png 16 December, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గంగాభవాని సంప్రోక్షణ మహోత్సవం

15-12-2025 01:53:58 AM

నేరేడుచర్ల, డిసెంబరు14 ః నేరేడుచర్లలోని శ్రీ గంగాభవాని అమ్మవారి సంప్రోక్షణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. లింగాల వేదపండితులు బ్రహ్మర్షి ఇరువంటి. సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తోరణ సేవ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్వ ప్రాసన, రక్షాబంధన, మండపావాహన, అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం, మహానివేదన, మహా పూర్ణాహుతి ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఉదయం నుంచి భక్తుల సందడి ఉండడంతో అమ్మవారికి అభిషేకాలు, కుంకుమాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కంభం సీతారాంరెడ్డి, కసిరెడ్డి మాధవరెడ్డి, ఆటో నాగయ్య, కసిరెడ్డి రాంరెడ్డి, దొంతిరెడ్డి వెంకటరమణారెడ్డి, యారవ సురేష్, మల్లారెడ్డి, బెల్లంకొండ శ్యాంసుందర్రెడ్డి, కొణతం సీతారాంరెడ్డి, భగవం తరెడ్డి, బూజునూరి సైదిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకట్రామయ్య, ఒంటెద్దు ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.