10 June, 2026 | 6:28 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డు బాట పడతా   •   మడే రాజేష్ కి 'గౌరవ డాక్టరేట్'   •   జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి   •   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •  

ఓడిన సర్పంచ్ అభ్యర్థి బుచ్చు రాములుని ఆదుకుంటాం..

15-12-2025 01:55 AM

మాజీ సర్పంచ్ మారెడ్డి శ్రీదేవి నర్సిరెడ్డి 

చండూరు, డిసెంబర్ 14 : స్థానిక మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మండలంలోని  శిర్దపల్లి సర్పంచ్ అభ్యర్థి  ధామర బుచ్చి రాములు  ఓడిపోయిన సందర్భంగా ఆ గ్రామ మాజీ సర్పంచ్  మారెడ్డి  శ్రీదేవి నర్సిరెడ్డి   ఆదివారం కుటుంబాని కలిసి మనోధైర్యం చెప్పి ఆదుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ ప్రభుత్వం  ఒక సర్పంచ్ కు ప్రతినెలా ఇచ్చే జీతం రూ. 6,500  మాధురి గానే  ఓడిన సర్పంచ్ దామర బుచ్చిరాములు కూడా  రూ.6,500 ప్రతినెల  గౌరవేతనంగా అందిస్తామని హామీ ఇచ్చారు.

కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా సాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం  గెలిచిన వార్డు మెంబర్లకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.  ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పోలా వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ పల్లె లింగయ్య, గంట గణపతి,కర్నాటి మహేష్, జోగి రెడ్డి, గంట రవి, సత్యనారాయణ, సురేష్, గంట మల్లయ్య పాలకూరి  యాదయ్య, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. 

 ప్రజా తీర్పును గౌరవిస్తా ః బుచ్చి రాములు

ఇటీవల స్థానిక ఎన్నికల్లో  తనకు ఓట్లు వేసి సహకరించినందుకుగాను, వారికి కృతజ్ఞతలు తెలుపుతూ   గ్రామస్తులు ఇచ్చిన ప్రజా తీర్పు మేరకు గౌరవిస్తా అని ఆయన  తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల  మేరకు  నడుచుకుంటానన్నారు.