13 April, 2026 | 10:31 AM

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జనరల్ అబ్జర్వర్

10-02-2026 12:11 AM

జనగామ, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి):ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా అవసరమైన మౌలిక వసతులు కల్పించి భరోసా ఇవ్వాలని..ఎన్నికల అబ్జర్వర్ నర్సింహా రెడ్డి అన్నారు. జనగాం మున్సిపాలిటీ లోని జ్యోతి నగర్ పరిధిలో గల సేయింట్  మేరీస్ హై స్కూల్, నెహ్రు నగర్ లో మండల పరిషత్ పాఠశాల లో ఏర్పాటు చేసిన  పోలింగ్ స్టేషన్ లను సోమవారం జనరల్ అబ్సర్వర్ నర్సింహా రెడ్డి  పరిశీలించారు.

ఎన్నికలు పకడ్బందీగా,  పారదర్శకంగా  జరిగేలా అధికా రులు తగు చర్యలు తీసుకోవాలని అబ్సర్వర్  సూచించారు. ఈ కార్యక్రమం లో  నోడల్ అధికారి మాతృ నాయక్,లైజనింగ్ అధికారి అన్వేష్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.