27 July, 2026 | 12:05 PM

Breaking News

లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •   మోదీ హామీ ఏమైంది? విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదు   •  

ప్రజల కష్టాల్లో నేనుంటా

10-02-2026 12:10 AM
  1. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తా 
  2.  8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడవత్ బాలకోటి 

భూత్పూర్, ఫిబ్రవరి 9 : ప్రజల కష్టాలని తన కష్టాలుగా భావించి నిజాయితీగా ప్రజాసేవ చేస్తానని 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడవత్ బాలకోటి అన్నారు. సోమవారం పట్టణంలోని 8 వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని నాయకులు కావాలా?. ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకులు కావాలా?అన్నది ఓటర్లు ఆలోచించాలని అన్నారు.

నిజాయితీతో సమస్యలను పరిష్కరించాలని తపనతో ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచిన తనను ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడవత్ బాలకోటి అన్నారు. ఆడబిడ్డ పెళ్లిళ్లకు తన సొంత డబ్బులతో రూ. 20 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ మీ ముందుకు వచ్చి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు.

ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గుర్తు చెయ్యి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన ఓటర్లను కోరారు. ఒక అవకాశం ఇస్తే ప్రజల నమ్మకాన్ని జీవితాన్ని అంకితం చేస్తానని ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.