calender_icon.png 7 May, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా వీర హనుమాన్ విజయయాత్ర

09-04-2025 01:51:06 AM

జగిత్యాల, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. కోరుట్లతో పాటూ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన హనుమాన్ దీక్షాపరులు, హిందూ యువజన సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో కోరుట్ల కాషాయమయంగా మారింది.

దండి స్వామీజీ జెండా ఊపి వీర హనుమాన్ విజయ యాత్రను ప్రారంభించగా, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల సెగ్మెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ తదితర ప్రముఖులు ఈ యాత్రలో పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన యాత్ర గాంధీ రోడ్, బస్టాండ్ రోడ్, అంబేద్కర్ రోడ్ మీదుగా కాల్వ గడ్డ నుండి తిరిగి వెంకటేశ్వరాలయం చేరుకుంది.

కాగా యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెట్పల్లి డిఎస్పీ అడ్డూరి రాములు, కోరుట్ల సీఐ సురేష్ బాబు నేతృత్వంలో పలువురు సిఐలు, ఎస్త్స్రలు, పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు బందోబస్తు నిర్వహించారు.  బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు, హనుమాన్ దీక్ష స్వాములు, పలుకుల, యువజన సంఘాలు పాల్గొన్నాయి.