calender_icon.png 6 May, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవీ వ్యామోహ పిశాచి కాంగ్రెస్ పార్టీ

09-04-2025 01:49:39 AM

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం

జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ప్రధాని మోదీ  రష్యా అధినేత పుతిన్ వలే నియంతలా దేశాన్ని పాలించాలని ప్రయత్నం చేస్తున్నాడని, డీలిమిటేషన్ పేరుతో దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు.

పదేళ్లు కేంద్రంలో, రాష్ట్రములో అధికారానికి దూరం కాగానే కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో అధికారంలోకి రావడానికి కర్ణాటకలో ఐదు గ్యారంటీల పేరుతో తెలంగాణాలో ఆరు గ్యారంటీల పేరుతో ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయక చతికిల పడిందని విమర్శించారు.

బిజెపి అంటేనే జాతీయవాద పార్టీ అని కాంగ్రెస్ పార్టీ మాత్రం జాతీయ సమగ్రతకు భంగం కలిగించే పార్టీ అని అందుకే స్వాతంత్య్రం అనంతరం 370 ఆర్టికల్ (35A) లాంటివి భారత రాజ్యాంగంలో బలవంతంగా చొప్పించా రన్నారు.

1975లో ఏమర్జెన్సీ విధించి సెక్యులర్ అనే పదం జోడించి 75 ఏళ్లుగా జాతీయ సమైక్యతకు భంగం కలిగిస్తే వాటిని రద్దు చేసి దేశంలో శాంతి, భద్రతలను నెలకొల్పిన దమ్మున్న నాయకులు నరేంద్రమోదీ అని అన్నారు. మోడీ నాయకత్వంలో బిజెపి దినదినాభివృద్ధి చెందితే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక చౌకబారు విమర్శలు చేస్తుందన్నారు.