30 August, 2026 | 4:16 AM

జీవో 97 రద్దు చేయాలి

30-08-2026 12:10 AM

మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

మహబూబాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అని, ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినప్పటికీ అందుకు విద్యార్థులు ఒప్పుకోవడం లేదని, పాలిటెక్నిక్ విద్యపై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న పద్ధతినే తెలంగాణలోనూ కొన సాగించాలని, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

విద్యా శాఖ మంత్రిగా పని చేసిన వ్యక్తి గా జీవో 97రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎంని  కోరుతు న్నట్ల కడియం తెలిపారు. స్టేషన్ ఘనాపూర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల నీటిని విడుదల చేసిన అనంతరం మీడియా సమావేశంలో ఆయనపై విధంగా స్పందించారు. కాగా అధికార పార్టీకి అసోసియేట్ గా వ్యవహరిస్తున్న కడియం శ్రీహరి అదేవిధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.