పోలియో రహిత సమాజమే లక్ష్యం
టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి, జూన్ 28: పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించడం అందరి బాధ్యత అని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి అన్నారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు.
చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు రెండు పోలియో చుక్కలే రక్షణ కవచమని అన్నారు.జిల్లాలోని ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి పల్స్ పోలియోకార్యక్రమంలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించా లన్నారు. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. లలిత కుమారి, మున్సిపల్ చైర్పర్సన్ వనితా సంతోష్, కౌన్సిలర్లు, వైద్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






