29 June, 2026 | 2:02 AM

రెండు పోలియో చుక్కలు.. నిండు జీవితానికి రక్షణ

29-06-2026 12:00 AM

గజ్వేల్, జూన్ 28: సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించారు. మున్సిపాలిటీ 17వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కళ్యాణ్కార్ పద్మభాయ్ నర్సింగ్రావు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలియో రహిత భారతదేశం లక్ష్యాన్ని కొనసాగించడంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

రెండు పోలియో చుక్కలు నిండు జీవితానికి రక్షణ అనే సందేశాన్ని ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.