calender_icon.png 21 February, 2026 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యం

21-02-2026 12:00:00 AM

  1. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

రూ.9.80 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

రాజేంద్రనగర్ ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి) : రాజేంద్రనగర్ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తు న్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శుక్రవారం మైలర్ దేవ్ పల్లి డివిజన్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో సుమారు 9కోట్ల .80 లక్షల రూపాయలతో చేపట్టే సిసి రోడ్, అండర్ డ్రైనేజీ పనులకు అధికారులు,స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మై లార్ దేవ్ పల్లి డివిజన్ లోని కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వం అభివృద్ధి పనులకు ఎంతో సహకారం అందిస్తుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ దశలవారీగా పరిష్కారం చూపిస్తు న్నానని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.