21-02-2026 12:00:00 AM
సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 5 : ఈ నెల 22 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని కమిషనర్ ఎస్.రష్మీ పెరుమాళ్ తెలిపారు. 22న ఉదయం 6 గంటల నుంచి మార్చి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.
అత్యవసరమైతే పోలీస్ అధికారుల అనుమతితీసుకోవాలని సూచించారు. బంద్‌ల పేరిట బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు ఉన్నాయని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని సీపీ కోరారు.