18-11-2025 12:51:08 AM
అంగన్వాడి కేంద్రాలపై నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలి
ప్రీస్కూల్ చిన్నారులకు 100 మి.లీ పాలు పంపిణీ
రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ములుగు,నవంబరు17(విజయ క్రాంతి): రాష్ట్రంలోని పేదరికంలో ఉన్న పిల్లలను ఆరోగ్యంగా ఉంచడం కోసమే ప్రభుత్వం బలమై న ఆహారం అందించడానికి చర్యలు తీసుకుంటుందని,చిన్నపిల్లలు దేవుళ్లతో సమా నంగా అంగన్వాడీ టీచర్లు చూసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా,శిశు సంక్షే మ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం ములుగు జిల్లా కేం ద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రం లో తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రీస్కూల్ చిన్నారులకు ప్రతీరోజు 100 మి.లీ పాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఐటీడీఏ పీవో చిత్రమిశ్ర, అదనపు కలెక్టర్ మహేందర్ జిలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మా ట్లాడుతూ రాష్ట్రంలోని పోషకాహార లోపాన్ని అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని పోషకాహార లోప రహిత తెలంగాణగా మార్చడాని కి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, అంగన్వాడి కేంద్రాల్లో 3నుండి 6సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు ప్రతిరోజు పాలను అందజేయడం జరుగుతుందని, ములుగు జిల్లాలో పేదరికంలో ఉన్న పిల్లలు అధిక సంఖ్యలో ఉండడంతో ఈ నూతన కార్యక్రమాన్ని ఇక్కడి నుండే ప్రారంభించడం జరిగిందని వివరించారు. పిల్లలకు అందించే ప్రతి ఆహారాన్ని అంగన్వాడీ టీచర్లు ప్రతిరోజు పరిశీలించాలని,
అనారోగ్యానికి గురి చేసే వస్తువులు వచ్చిన పక్షంలో వెంటనే ఫి ర్యాదు చేయాలని సూచించారు. రాష్ట్ర ము ఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి అంగన్వా డి సెంటర్లను బలోపేతం చేయడానికి ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారని, ప్రతి టీచర్ కు చీరలు పంపిణీ చేయడంతో పాటు వేతనాలను పెంచడం జరిగిందని అన్నారు. సొంత పిల్లల్లాగానే అంగన్వాడి పిల్లలను చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని సైతం అంగన్వాడి సెంటర్లో చేర్పించాలని తె లిపారు.
కార్పొరేట్ స్థాయి పాఠశాలకు దీ టుగా సెంటర్లను బలోపేతం చేస్తున్నామని, ప్రతి సెంటర్ నిర్వాహకులు పిల్లల తల్లిదండ్రులతో నిత్యం సమావేశాలు నిర్వహించాల ని సూచించారు. అంగన్వాడీ టీచర్లు అనుకోకుండా మృతి చెందిన పక్షంలో వారి పిల్లల కు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభు త్వం జీవో జారీ చేస్తుందని,
సెంటర్లకు చెడ్డ పేరు రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా విధు లు నిర్వహించాలని అన్నారు. ప్రజా ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చడానికి కృషి చేస్తాన ని, అంగన్వాడి సెంటర్ లపై అంగన్వాడి సెంటర్ లపై నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి అంగన్వాడీ టీచర్లు క్రియాశీల పాత్ర వహించాలని సూచించారు.