calender_icon.png 18 November, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ సాయం

18-11-2025 12:51:42 AM

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాం తి): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ‘మైలారం’లో ఇటీవల అనారోగ్యంతో మరణిం చిన చిలువేరు కొమురుమల్లమ్మ, పెందో ట రామనాథం కుటుంబ సభ్యులను ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబనికి 50 కేజీల బియ్యం, ఆయిల్ క్యాన్‌ను అందజేశారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు బాధ రవి కాలుకు గాయమై చికిత్స తీసుకోని ఇంటి వద్ద విశ్రాం తి తీసుకుంటున్న సందర్భంగా పరామర్శించారు.

అనారోగ్యంతో చికి త్స తీసుకున్న ఈర్ల తీర్మాల్ కూతురును పరామర్శించి ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, మండల పార్టీ నాయకులు రంగారెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధులు గజావెల్లి ప్రసాద్, సంధి దేవేందర్‌రెడ్డి, కోలా సంపత్, మండల నాయకులు గుడెల్లి వెంకటయ్య, కోలా కొముర య్య, ఎల్లస్వామి, చందురామ్, చందు సతీష్, సాయి గౌడ్, ఐత జంపి  పాల్గొన్నారు.