వెన్నుముకకు అరుదైన శస్త్రచికిత్స..
- లామినోటోమి పద్ధతిలో స్పైనల్ ట్యూమర్ తొలగింపు
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో శనివారం అరుదైన ఆపరేషన్ చేసినట్టు వైద్యులు నాలం స్వప్న శశికాంత్ తెలిపారు వెన్నుముక సంబంధించిన ట్యూమర్ ని తొలగించే చాలా అరుదైన శస్త్ర చికిత్సను ఆస్పత్రి వైద్యులు ఆరోగ్య శ్రీ పథకంలో ఓ పేద కుటుంబానికి పూర్తి చేశారు. లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన 45ఏళ్ల నాగ భూషణ్ చాలారోజుల నుండి వెన్నునొప్పితో హాస్పిటల్లో చేరినట్టు తెలిపారు.
అన్ని రకాల పరీక్షలు నిర్వహించి జనరల్ సర్జన్ డాక్టర్ శశికాంత్, న్యూరో సర్జన్ డాక్టర్ సచిన్ ఆయనను పరీక్షించి, ఎంఆర్ఐ స్కానింగ్ చేయించగా వెన్నుపూసలో 11 సెంటిమీటర్ల స్పైనల్ ట్యూమర్ ఉందని తేలింది. ఇది D3 నుండి D8 వర్టిబ్రలో ఉంది. ఆ స్పైనల్ ట్యూమర్ ని లామినోటోమి (LAMINOTOMY) మరియు లామినో ప్లాస్టీ (LAMINOPLASTY) అనే టెక్నిక్ ద్వారా ఈ ఆపరేషన్ పూర్తి చేయడం జరిగింది అన్నారు. ఇలాంటి ట్యూమర్లు చాలా అరుదుగా వస్తాయని, మాములుగా ఇది వెన్నుముకకు సంబంధించిన వర్టిబ్రా నుండి వస్తుందనీ వైద్యులు వివరించారు.
ఇది పెరగడం వల్ల, బాధితులకు నడవడానికి ఇబ్బందిగా మారుతుందని, చేతులు కాళ్ళు తిమ్మిర్లు, బ్యాలెన్స్ తప్పడం లాంటివి జరుగుతాయని వివరించారు. అలాగే ఈ ట్యూమర్ ఇంకా ఎక్కువగా పెరగడం వలన మూత్రం, మోషన్ ఆగిపోయి చాలా ఇబ్బంది వస్తుందని చెప్పారు. ఆపరేషన్ తప్పనిసరి పరిస్థితి కావడంతో పేషెంట్ బంధువులకు రిస్క్ గురించి వివరించామన్నారు. వాళ్లు తమపై నమ్మకంతో సర్జరీకి ఒప్పుకోవడంతో, ఐదు వెర్టిబ్రా లెవెల్స్ నుండి ఈ స్పైనల్ ట్యూమర్ ని విజయవంతంగా తొలగించినట్లు వివరించారు.
కంప్లికేషన్స్ రాకుండా సర్జికల్ బృందం అడ్వాన్స్డ్ టెక్నిక్ ద్వారా వెన్నుపూస నరాలు దెబ్బ తినకుండా లామినోటోమీ టెక్నిక్ ద్వారా చేసి, దాని తర్వాత లామినొప్లాస్టి అనగా ట్యూమర్ ని తొలగించిన తర్వాత ఏదైతే వర్టిబ్రా వెన్నుముకకు సంబంధించిన బొక్క దాన్ని రీకన్ స్ట్రక్టడ్ పద్దతిలో చేశామన్నారు. దీనివలన సర్జరీ తర్వాత కంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయని, భవిష్యత్తులో వచ్చే కంప్లికేషన్స్ కూడా దూరం చేయగల్గుతామని అన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఈ అరుదైన ఆపరేషన్ పూర్తి చేసిన వైద్య బృందానికి రోగి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




