జీతాలు తగ్గిస్తే.. విద్యా వ్యవస్థ బాగుపడుతుందా?
హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) మరోసారి రేవంత్ సర్కార్ పై నిప్పులు చేరిగారు. రిటైర్డ్ ఉద్యోగులకు(Retired employees) బెనిఫిట్స్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. విద్యారంగంపై అధికారి మురళి ఇచ్చిన నివేదిక అసంబంద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరితోనూ చర్చించకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నివేదిక ఇచ్చారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు జీతాలు(Teachers Salaries) తగ్గించాలని నివేదిక ఏమిటీ?, ఉపాధ్యాయులకు జీతాలు తగ్గిస్తే.. విద్య వ్యవస్థ బాగుపడుతుందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యాశాఖకు(Department of Education) ప్రత్యేకంగా మంత్రి కూడా లేరని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పేదోళ్లు ఏడుస్తుంటే ఎంత వ్యంగ్యంగా నవ్వుకుంటూ రాక్షస ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. అప్పులు చేసి రేకుల షెడ్డుతో కట్టుకున్న ఇళ్లను కూల్చుతుంటే పెదొడు గుండెలు పగిలేటట్లు ఏడుస్తున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం(KCR Government) గతంలో ఇళ్లు కూలిస్తే ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరేందుకు కూల్చుతున్నారని ద్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి యువత, మహిళలు, ఉద్యోగ వర్గాలు, తాత, అమ్మమ్మలు, పేదలు వ్యతిరేకంగా ఉన్నారని బండి సంజయ్ వివరించారు. ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రైతుల ఇచ్చని హామీ ప్రకారం రైతు భరోసా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.




