28 February, 2026 | 5:17 PM

ఘనంగా శ్రీ సిద్ధేశ్వర్ సంస్థాన్ ధ్యాన మందిర వార్షికోత్సవం

28-02-2026 03:22 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మండలంలోని గుండి గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వర్ సంస్థాన్ ధ్యాన మందిరం 12వ వార్షిక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక జ్ఞాన సత్సంగ ప్రవచన కార్యక్రమంలో గుండి సర్పంచ్ జబరి రవీందర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సద్గురు పూలాజీ బాబా  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడు తన జీవితంలో అలవర్చుకోవాల్సిన మంచి అలవాట్లు, జీవన మార్గాల గురించి బాబా సమాజానికి విపులంగా సూచించారని తెలిపారు. మనిషి సుఖదుఃఖాలు, ఆయురారోగ్యాలతో జీవించేందుకు బాబా  చూపిన ధ్యాన మార్గమే ఉత్తమ మార్గమని అన్నారు. మనందరం బాబా  ఆశయ సాధనకు కృషి చేయాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  చిరంజీవి,  వామన్ రావు ,  కాశీనాథ్, వార్డు సభ్యులు రాజు, మోహన్, తిరుపతి, మాజీ ఏఎంసి డైరెక్టర్ దాన్పెల్లి శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు.