calender_icon.png 10 January, 2026 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యం

09-01-2026 12:00:00 AM

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

ఉప్పల్ జనవరి 8 (విజయక్రాంతి) : అధికార హోదా కానీ ప్రతిపక్ష హోదా కానీ ఏ హోదాలో ఉన్న తన నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఉప్పల్ నియోజకవర్గం శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం నాడు నాచారం డివిజన్లోని స్థానిక కార్పొరేటర్ శాంతితో కలిసి 86 లక్షల రూపాయల సిమెంటు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవర్గ పరిధిలోని కాలనీలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

రానున్న రోజులలో సమస్య లేని నియోజకవర్గంగా ఉప్పల్ నియోజకవర్గం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్, కాప్రా సర్కిల్ ఈ ఈ రమేష్ బాబు డిఈ ఉమామహేశ్వరి వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ గ్రేటర్ హైదరాబాద్ బి ఆర్ ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్ సీనియర్ బిఆర్‌ఎస్ నాయకులు ముత్యంరెడ్డి కాలనీవాసులు మహిళలు పాల్గొన్నారు.