calender_icon.png 10 January, 2026 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు నల్లబ్యాడ్జీలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన

09-01-2026 12:00:00 AM

ఐక్య ఉద్యమంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి రావాలి 

టీఎస్ యుటిఎఫ్, ఎస్‌టియు పిలుపు 

మహబూబ్ నగర్ టౌన్, జనవరి 8: సీనియర్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయించాలని, ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపి) ని రద్దు చేయాలని, పాఠశాలల మూసివేత, విలీనాలను ఆపాలని, ఎన్పిఎస్, సిపిఎస్ లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రాథమిక ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలని తదితర  డిమాండ్లతో అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఎఐ జాక్టో) పిలుపు మేరకు శుక్రవారం రోజు అన్ని పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు నిర్వహించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీఎస్ యుటిఎఫ్ ఎస్ టి యు నాయకులు సమావేశం అయ్యారు. 

ఈ సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కే రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్ వెంకటేష్; ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు నరసింహులు గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, వెంకటేష్ (ఎస్ టి యు), చంద్రయ్య, హేమంత్ కుమార్ (టి ఎస్ యు టి ఎఫ్) లు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రతి ఉపాధ్యాయుడు నల్లబ్యాడ్జిలు ధరించి శుక్రవారం నిరసన తెలిపాలని పిలుపునిచ్చారు.