ప్రతి కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే లక్ష్యం..
బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ప్రతి కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే లక్ష్యమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ(BRS leader Shambipur Krishna) అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బహదూర్ పల్లిలోని 15వ వార్డు ప్రణీత్ ఫ్లోరా కాలనీ సభ్యులు 15వ వార్డు మాజీ కౌన్సిలర్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వారి కాలనీలో మంచినీటి కనెక్షన్లు ఏర్పాటు చేయించిన సందర్భంగా పుష్పగుచ్చం ఇచ్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ నాగమణి, వైస్ ప్రెసిడెంట్ హరీష్, సభ్యులు పెద్దినేని, నాగరాజు, ఫ్లోరా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.




