calender_icon.png 25 May, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాకలి ఐలమ్మ విజ్ఞాన కేంద్రానికి స్థలం కేటాయించాలి..

25-05-2025 07:46:01 PM

రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల సుదర్శన్..

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ 57వ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ భవన్ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని చాకలి ఐలమ్మ విజ్ఞాన కేంద్రంతో పాటు రజక కమ్యూనిటీ హాల్ కు కేటాయించాలని రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు పారుపెల్లి రవికుమార్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి(MLA Rajender Reddy)ని కోరారు. గ్రేటర్ వరంగల్ 57వ డివిజన్లో రజక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని బాల సముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్మాలయంలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రావుల సుదర్శన్, పారుపల్లి రవి కుమార్ లు మాట్లాడుతూ... వడ్డెపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే వెంబర్ 184 లోని ప్రభుత్వ భూమి 300 చదరవు గజాల స్థలాన్ని చాకలి ఐలమ్మ విజ్ఞాన కేంద్రంతో పాటు రజక కమ్మ్యూనిటీ హాలు కోసం కేటాయించి ప్రభుత్యం ద్వారా నిధులు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో రజక సంఘం నేతలు చాగంటి ప్రభాకర్, సుంకరి రాజు, లింగయ్య, దొడ్డిపాటి కుమార్, గుడికందుల సుజాత, గొల్ల పెళ్లి స్వరూప, గాజే ఉమ, శాగంటి స్వప్న, వెంకటలక్ష్మి, రావుల కనకరాజు తదితరులు ఉన్నారు.