29-07-2025 01:48:40 AM
శ్రీరంగాపురం మండలం జులై 28. మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ రంగనా యక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం గోదాదేవి అమ్మవారి తిరు నక్ష త్ర మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం శ్రావణమాసం సందర్భంగా రథోత్సవాన్ని ఏర్పాటు చేయ డం జరుగుతుంది. ఈ రథోత్సవంలో పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ర థోత్సవాన్ని లాగడం ఇక్కడి ప్రత్యేకత.
ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ఈ రథోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకు లు కన్నయ్య తెలిపారు. గోదాదేవి రథోత్స వం అనేది ఒక ముఖ్యమైన పండుగ, ఇది చాలా వైభవంగా, సాంప్రదాయపద్ధంగా ని ర్వహిస్తారు. రథోత్సవం వీక్షించడానికి భక్తు లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఎందుకంటే ఇది ఒక కన్నుల పండుగలాంటి అను భూతిని కలిగిస్తుంది. రథోత్సవాన్ని లాగు తూ పెద్దఎత్తున హాజరైన భక్తులు, విద్యార్థులు గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మారు మోగించారు.