సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం
02-04-2026 01:15 AM
శ్రీనయ్య ప్యానెల్
జూబ్లీహిల్స్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల నేపథ్యంలో బీ. శ్రీనయ్య ప్యానెల్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్యానెల్ సభ్యు లు ఘంటా అజాద్ బాబు, ఇంటూరి ప్రవీణ్ రెడ్డి, కోన వినోద్ రెడ్డి, ఎన్. అనిల్ రెడ్డి, డాక్టర్ ఎం.ఆర్.సి నాయుడు, రాజేష్, డాక్టర్ అనిల్ కొల్లి పాల్గొని ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఘంటా అజా ద్ బాబు మాట్లాడుతూ.. సొసైటీ సభ్యులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కేవలం శ్రీనయ్య ప్యానెల్తోనే సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో తమ ప్యానెల్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.




