calender_icon.png 20 November, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యం అందరికీ ఆదర్శం

20-11-2025 12:51:05 AM

జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మి కాంతారావు

బిచ్కుంద, నవంబర్ 19 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా భారత మాజీ మహిళా ప్రధాని,భారతరత్న, స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ  జయంతి సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరా గాంధీ  చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈ సందర్బంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు   మాట్లాడుతూ..ఇందిరా గాంధీ  భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పారని.. ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని శక్తిమంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు.

ఇందిరాగాంధీ  దేశానికి అందించిన నిరుపమాన సేవలు నేటితరం నాయకులకు, యువతకు సైతం స్ఫూర్తిదాయకమని తెలిపారు.. బ్యాంకుల జాతీయకరణ, జమీందారీ వ్యవస్థ రద్దు, గరీబీ హఠావో వంటి దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఇందిరా గాంధీ గారు భారత స్త్రీ శక్తికి ప్రతీక అని, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే నాయకురాలిగా  ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని వెల్లడించారు.. అవకాశాలు వస్తే అద్భుతాలు చేయగలం అంటూ నిరూపించారని..ప్రతి మహిళకు ఆమె చూపిన ధైర్యం, అంకితభావం నేటికీ స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి పటేల్ మండల కాంగ్రెస్ నాయకులు  పాల్గొన్నారు.

తాడ్వాయి..

తాడ్వాయి, నవంబర్, 19( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... దేశం కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆమె దేశ సేవ కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన వీర వనిత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి,నాయకులు అంబీర్ శ్యాం రావు, ఆకిటి వెంకట్ రామ్ రెడ్డి, గైని శివాజీ, రామచంద్రం, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీ ప్రధాని, పేదల పెన్నిధి, ఇందిరా గాంధీ పేరు చిరస్మరణీయం

ఎల్లారెడ్డి, నవంబర్(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో నా దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ నివాసం ఉండాలని సంకల్పంతో ఆరోజు ఇందిరా గాంధీ  తీసుకున్న నిర్ణయం, ఇప్పటికీ దేశమంతటా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ పాలన కొనసాగుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ కొనియాడారు.

దేశానికి, పేద ప్రజలకు ప్రధానిగా ఎనలేని సేవలు చేశారని ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజిత వెంకట్రాంరెడ్డి, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా ఇందిరాగాంధీ సేవలను కొనియాడారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, మాట్లాడుతూ, భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి గా ఎన్నికై దేశానికి ఎనలేని సేవలు చేసి, దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల, స్థలాలు, భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, మాజీ జడ్పిటిసి గాయాజుద్దీన్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిబాబా గౌడ్, సుడ సంజీవులు, నాయక సాయిలు, నాగం శ్రీనివాస్, సర్దార్, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  

కామారెడ్డి, నవంబర్ 19 (విజయక్రాంతి), మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నోట ఎనిమిదవ జయంతి ఉత్సవాలను బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల వేసి  నివా ళులర్పించారు.  కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యా లయంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు  ఘనంగా నివాళులర్పించారు. దేశ నిర్మాణం లో, సామాజిక న్యాయ సాధనలో, పేదల సంక్షేమంలో ఇందిరాగాంధీ గ పాత్ర అపారమని గుర్తుచేశారు.

మె చూపిన ధైర్యం, దూరదృష్టి, నాయకత్వం నేటికీ దేశానికి ప్రేరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆమె చిత్రపటానికి పూలమా లలు వేసి, భావపూర్వక నివాళులు అర్పిం చారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ తర ఫున ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు,పట్టణ కాంగ్రెస్ అధ్య క్షులు పండ్లరాజు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంపరిలక్ష్మణ్,మాజీ కౌన్సిలర్లు కన్నయ్య, ప్రసన్న చాట్ల రాజేశ్వర్, రాజు.లడ్డు.కాళ్ళ గణేష్,అన్వర్ బాయ్,తేజపు ప్రసాద్,కాళ్ళ గణేష్, నర్సింలు, ఆకుల రవి, రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గణేష్ నాయక్, దోమకొండ శ్రీనివాస్, సీని యర్ కాంగ్రెస్ నాయకులు కారంగుల అశో క్ రెడ్డి, వైద్య కిషన్ రావు, రాజా గౌడ్,పిల్లి మల్లేష్, జమీల్ ,సిద్ధికి, యూనుస్, శంకర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుమ ప్రియ,లక్క పతిని గంగాధర్  పాల్గొన్నారు.