20-11-2025 08:14:40 AM
హైదరాబాద్: నేషనల్ హైవే–44పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మహబూబ్ నగర్ జిల్లా(Mahabubnagar District) జడ్చర్ల మండలం మాచారం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన జగన్ ట్రావెల్స్ బస్సు ట్యాంకర్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు.
బస్సు హైడ్రోక్లోరిక్ యాసిడ్(Hydrochloric acid) ఉన్న ట్యాంకర్ ను ఢీకొట్టినట్లు సమాచారం. ట్యాంకర్ లోని కెమికల్ వల్ల ప్రమాదస్థలంలో భారీగా పొగ వ్యాపించింది. ఈ ప్రమాదంతో మాచారం ఫ్లైఓవర్ వద్ద కిలో మీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘాటైన వాసన, పొగవల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్- బెంగళూరు జాతీయరహదారిపైన(Hyderabad-Bangalore National Highway) ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.