16 April, 2026 | 10:31 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

26-06-2025 10:55 PM

మండల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మొజామిల్..

ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ నాయకులు..

చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండల్ చందాయిపెట్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మండల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ ముజామిల్(Congress Party General Secretary Mohammad Muzammil), మండలం హౌసింగ్ ఏఈ రియాజుద్దీన్, పంచాయతీ సెక్రెటరీ కృష్ణ ఆధ్వర్యంలో ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపన చేసి ముగ్గులు పోశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడం చాలా సంతోషకరం ఉందని, గత ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టకపోవడంతో, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించడం జరిగిందని అన్నారు.

అందుకుగాను కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన మాట, ప్రతి పథకం, ప్రజల వద్దకే వెళుతుంది,అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల , మా గ్రామానికి 30 మంజూరు చేసినందుకు, కాంగ్రెస్ పార్టీ తరుపున సోనియా గాంధీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉమ్మడి మెదక్ జిల్లా నూతన మంత్రివర్యులు వివేక్ కు, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డికి,  కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఏఈ మహమ్మద్ రియాజ్, గ్రామ కార్యదర్శి కృష్ణ, ఇందిరమ్మ కమిటీ, మెంబర్స్, పబ్బ నగేష్ గుప్తా, బైండ్ల శివరాజయ్యా, అచంపేట్ పద్మ స్వామి, బాసరాజు, ఉప్పరి సిద్దిరాములు, అచంపేట్ యాదగిరి, ఎల్లమేశ్వర్, చిట్టాబోయిన రాములు, నర్సింలు, స్వామి, అవుబోతు మల్లేష్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.