17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పాలక వర్గాన్ని రద్దు చేయాలి

03-02-2026 12:43 AM
  1. మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి 

ఎండీ గఫార్‌కు నోటీసు అందజేసిన పాలు సంఘాల చైర్మన్లు 

వేతనాలు చెల్లించాలని ఉద్యోగుల ఆందోళన 

ఎల్బీనగర్, ఫిబ్రవరి 2: రైతులకు బిల్లులు ఇవ్వకుండా, ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా మదర్ డెయిరీ సంస్థను దివాలా తీయించిన ప్రస్తుత చైర్మన్, పాలకవర్గం రాజీనామా చేయాలని మాజీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నార్మాక్స్ యూనియన్ సభ్య సంఘాల అధ్యక్షులు రైతుల పెండింగ్ బిల్స్ చెల్లించాలని ‘నార్ముల్’ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

ఈ మేరకు సోమవారం మదర్ డెయిరీ ఎండీ గఫార్ కు పాలు సంఘాల చైర్మన్లతో కలిసి నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  లాభాలతో ఉన్న మదర్ డెయిరీని అవినీతి, అనాలోచిత నిర్ణయాలతో ప్రస్తుత పాలకవర్గం వెంటనే రాజీనామా చేయాలన్నారు. తన హయాం లో కరోనా సమయంలో కూడా రూ, 13 కోట్లు నష్టాలతో ఉన్న మదర్ డెయిరీ ఇప్పుడు రూ. 80 కోట్ల అప్పుల ఊబీలో ఉందన్నారు. డైయిరీ నష్టాలకు పాలకవర్గం అవినీతే కారణమని, డైరెక్టర్లు తమ లాభాలు చూసుకుని, అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు.

నోటీసు ఇచ్చిన 10 రోజుల్లో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో .. పాలకవర్గాన్ని రద్దు చేసేందుకు అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని ఎండీ గఫార్‌కు పాల సంఘాల అధ్యక్షులు నోటీసులు ఇచ్చారు. అనంతరం చైర్మన్ ఖాళీ కుర్చీకి కూడా నోటీసు ఇచ్చి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్లు, పాల సంఘాల చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు. 

వేతనాలు చెల్లించాలని ఉద్యోగుల ఆందోళన 

మూడు నెలల జీతాలు ఇవ్వాలంటూ ఉద్యోగులు, కార్మికులు మదర్ డెయిరీ ప్రధా న కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టా రు. మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డికి తమ సమస్యలను వివరించారు. తమకు అండగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ... గత నెలలో ఇద్దరు చైర్మన్లు మారడంతో  డైయిరీలో ఏం జరుగుతుందో తెలియడం లేద న్నారు. తాము సమస్యలను ఎవరికి చెప్పా లో తెలియక రెండు నెలల నుంచి తీవ్ర ఇ బ్బంది పడుతున్నామని చెప్పారు.