సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
చిట్యాల, మార్చి 21 (విజయక్రాంతి): శనివారం నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి పర్యటించారు. స్వయంగా బైక్ నడుపుతూ బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి వచ్చే కాలువలను పరిశీలించారు. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే దారులలో నాలుగు చక్రాల వాహనాలు వెళ్లేందుకు సరైన మార్గాలు లేనందున ద్విచక్ర వాహనం నడుపుకుంటూ కాలువలను పరిశీలించారు.
పంట పొలాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. ఉదయ సముద్రం చుట్టుపక్కల మండలాలలోని గ్రామాలు సస్యశ్యామలంగా ఉండాలని తాను ఉదయసముద్రం ప్రాజెక్టును బ్రాహ్మణ వెల్లంలలో నిర్మించడానికి కృషి చేశానని మంత్రి తెలిపారు. సాగునీటి లభ్యతపై రైతులతో ముఖా ముఖిగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సాగునీరు రైతులకు అందుతుందో లేదో అడిగి తెలుసుకుని, సాగునీటి సమస్యలు ఉన్నట్లయితే పొలాలకు చెరువులకు నీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు.




