6 July, 2026 | 9:39 PM

Breaking News

గిరిజన దర్బార్ లో గిరిజనులు అందించిన ప్రతి విన్నపాన్ని సత్వరమే పరిష్కరించాలి   •   శివంపేట గ్రామానికి నిధుల మంజూరుపై హర్షం!   •   ప్రమాద బాధిత కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చేయూత   •   ముత్తారం ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •  

కరీంనగర్ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య

22-03-2026 01:15 AM

భార్య మృతిని తట్టుకోలేక బలవన్మరణం

ఐదు రోజుల క్రితమే భార్య సూసైడ్

అత్తవారింట్లో ఉరేసుకున్న చంద్రశేఖర్ యాదవ్

అనాథలైన ఇద్దరు చిన్నారులు 

హుజురాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్ర శేఖర్ యాదవ్ శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఐదు రోజుల క్రితమే ఆయన భార్య దివ్య కడుపునొప్పి భరించలేక గన్నేరు పప్పుతిని ఆత్మహత్య చేసుకోగా.. మనస్తాపానికి గురైన ఎస్సై సైతం ప్రాణాలు తీసుకున్నారు. కాగా దివ్య అంత్యక్రియల్లో చంద్రశేఖర్ పాల్గొనగా, ఆమె మరణానికి భర్తే కారణమంటూ దివ్య కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారనే సమాచారం.

దీంతో దివ్య తండ్రి గ్రామస్తులను వారించి వివాదం సద్దుమణిగేలా చేశారని తెలిసింది. అయితే శనివారం జమ్మికుంట మండలం సీతంపేటలో అత్తగారింట్లో దివ్య ఐదు రోజుల కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి హాజరైన ఎస్సై.. కార్యక్రమం అనంతరం అత్తవారింట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతదేహాన్ని  జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల మరణాలతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.