22 March, 2026 | 7:29 AM

ఆడపిల్లలూ జర జాగ్రత్త!

22-03-2026 01:12 AM
  1. సోషల్‌మీడియాలో హనీట్రాప్?
  2. అందమైన ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్
  3. తీయటి మాటల వెనుక సైబర్ రాక్షసులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 21 (విజయక్రాంతి): అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఎంతో మంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి.వి. సజ్జనార్  చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో యువతులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, అపరిచితులతో ఏర్పడే పరిచయాలు ఊ హించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం ఆయన ఆడపిల్లలకు, తల్లిదండ్రులకు పలు కీలక సూచనలు చేస్తూ.. అప్రమత్తంగా ఉం డాలని కోరారు. సైబర్ నేరగాళ్ల నేర శైలిని సీపీ సజ్జనార్ వివరించారు. అందమైన యువకులు లేదా సినీ నటుల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకుని నేరగాళ్లు ఫేస్బు క్, ఇన్స్టాగ్రామ్ లలో తిష్టవేస్తున్నారు. అమాయక అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపి, మాయమాటలతో వారిని బుట్టలో వేసుకుంటున్నారు.

వారి మాటలు నమ్మి ఆడ పిల్లలు తమ వ్యక్తిగత ఫోటోలు, ప్రైవేట్ వీడియోలను పంచుకోగానే.. ఆ తీయటి స్నేహం కాస్తా భయంకరమైన బ్లాక్మెయిలింగ్‌గా మారుతోంది అని పేర్కొన్నారు. ఒక్కసారి ఫోటోలు చేతికి చిక్కగానే అపరిచితులు రాక్షసులుగా మారిపోతున్నారని సీపీ హెచ్చరిం చారు. ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి, డబ్బులు ఇవ్వాలని లేదా భౌతికంగా కలవాలని వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు.

పరువు పోతుందన్న భయంతో, ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక కొందరు యువతులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, చివరకు అది ఆత్మ హత్యలకు దారితీస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి విషాదకర ఘటనలు తన దృష్టికి వచ్చినప్పుడు ఎంతో బాధనిపిస్తోందని ఆయన అన్నారు.

ఏదైనా అన్యా యం జరిగితే వెంటనే కుటుం బ సభ్యులకు లేదా నమ్మకమైన స్నేహితులకు సమాచారం ఇవ్వాలని, డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అండగా పోలీస్ యం త్రాంగం నిరంతరం సిద్ధంగా ఉంటుందన్నారకు. బాధితుల వివరాలను అత్యంత గోప్యం గా ఉంచుతామని చెప్పారు.