calender_icon.png 5 September, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డెరల సంక్షేమానికి సర్కారు పెద్ద పీట

04-09-2025 01:42:15 AM

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

వడ్డెపల్లి, సెప్టెంబరు 3 : వడ్డెర కులస్తుల సంక్షేమానికి సర్కారు పెద్ద పీట వేస్తూ ప్రత్యేక రాయితీ పథకాలను రూపొందించి అమలు చేసున్నదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  అన్నారు. హనుమకొండ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన గండికోట సంపత్ బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వడ్డెర కులస్తులకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్ధిక రుణ సహాయాన్ని అందించడంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో వడ్డెర సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు మల్లికార్జున్, అర్బన్ అధ్యక్షుడు కంది శ్రీనివాస్, కాజీపేట మండల అధ్యక్షుడు కంది రాజు, యూత్ అధ్యక్షుడు పల్లపు నవీన్, ఐనవోలు మండల అధ్యక్షుడు వల్లెపు నాగరాజు ఉన్నారు.