04-09-2025 01:42:27 AM
హనుమకొండ సెప్టెంబర్ 03 (విజయ క్రాంతి): గాంధీనగర్ స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని సిపిఎం సీనియర్ నాయకులు తొట్ల మల్లేశం అన్నారు.ప్రజా సమస్యల అధ్యయన యాత్రలో భాగంగా సిపిఎం పార్టీ ఖాజీపేట మండల ప్రతినిధి బృందం బుధవారం దర్గా గాంధీనగర్ స్మశాన వాటికను సందర్శించారు.
స్మశాన వాటికను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని లేనిచో సిపిఎం పార్టీ కాజీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ వాసులందరినీ ఐక్యం చేసి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఓరుగంటి సాంబయ్య, జంపాల రమేష్, గద్దల బద్రి, మేక మల్ల బాబు పాల్గొన్నారు.