28 May, 2026 | 1:55 AM

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది

28-05-2026 12:35 AM

ఎమ్మెల్యే బొజ్జు పటేల్

జన్నారం, మే 27 : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యం ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఖానాపూర్ ఎంఎల్‌ఏ వెడ్మా బొజ్జు పటేల్ తెలిపారు. బుధవారం మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే గాలి వాన బీభత్సం వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యం మిల్లులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జన్నారంలోని మార్కెట్ యార్డ్ పరిధిలో తడిసిన వడ్లు, మొక్కజొన్న సెంటర్లను సందర్శించి రైతులతో మాట్లాడారు.

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని రైతులకు సూచించారు. రైతులు కోరిన విధంగానే గిట్టుబాటు ధరకే ప్రభు త్వం కొనుగోలు చేస్తుందని, అవసరమైన రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈ విషయమై పై అధికారులతో మాట్లాడామని, ట్రాన్స్ పోర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎంఎల్‌ఏ వెంట ఎంపీడీవో ఉమర్ షరీఫ్, తహసిల్దార్ బక్కయ్య, ఈవో రాహుల్, ఏఓ అంజిత్ కుమార్, ఏపీఎం లలిత, పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, పోనకల్ సర్పంచ్ జక్కు సు ష్మ భూమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందు నాయక్ తదితరులున్నారు.