11-11-2025 12:00:00 AM
కొత్తపల్లి, నవంబర్ 10(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో న్యాలపట్ల రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్యఅతిథిగా గీత పనివారల సంఘం రాష్ట్ర కో - కన్వీనర్ బొమ్మగా ని నాగభూషణం హాజరైనారు.
ఈ సందర్బం గా మాట్లాడుతూ రాష్ట్రంలో కల్లుగీత వృత్తిపై ఆధారపడి లక్షలాదిమంది వెనకబడిన వర్గాలకు చెందిన గీతా కార్మికులు తమ కుటుం బాలను పోషించుకుంటున్నారని, గీత వృత్తిదారులు నిరంతరం సమస్యలతో సతమత మవుతున్నారని చెట్లపై నుండి ప్రమాదవశాత్తు పడిపోతే వారి ప్రాణాలకే కాళ్లు చేతులు విరిగి వారి ప్రాణాలకే నష్టం కలగడంతో పాటు దురదృష్టవశాత్తు మరణించ డం కూడా జరుగుతుందని, వారికి రక్షణ లే కుండా పోతుందని, వారికి ప్రభుత్వం సరైన నిధులు కేటాయించకపోవడం, అధునీకరణ మరియు పరిశ్రమగా గీత వృత్తి రూపొందకపోవడం బాధాకరమని నాగభూషణం ఆవేదన వ్యక్తం చేశారు.
గీత కార్మికులు చెట్ల పైనుండి పడి మరణాలు సంభవిస్తే వికలాంగులు అయితే వా రి కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభు త్వం అందించే ఎక్స్ గ్రేషియా రూపాయలను తక్షణమే విడుదల చేయాలని, గీత వృ త్తి రక్షణ మృతి ధరల సంక్షేమం అధునీకరణ వన పెంప కాలకు 10 ఎకరాల భూమి ఇవ్వాలని, వృత్తి రక్షణ కోసం రక్షణ కవచా లు పంపిణీ చేయాలని అన్ని సహకార సం ఘాలకు ఆర్థిక సహాయం అందించాలని రా ష్ట్ర ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీ లో గీతా కార్మికులకు ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టాలని ఏజెన్సీ జిల్లాలలో గీత వృత్తిదారులకు సొసైటీలు ఏర్పాటు చేసి టిఎఫ్టిలు ఇవ్వాల్సిన అవసరముందని అన్నారు.
గీత వృత్తిలో చనిపోయిన కుటుంబాలకు ప్రభు త్వం అందించే ఎక్స్గ్రేషియాను ఐదు లక్షల నుండి పది లక్షలకు గాయాల పాలైతే రెండు లక్షలు పెంచాలని మెడికల్ బోర్డు విధానం రద్దు చేయాలని, ప్రభుత్వ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పర్యవేక్షణలో తాత్కాలిక శాశ్వత వికలాంగుల నిర్ధారణ సర్టిఫికెట్లు పద్ధతిని తిరిగి పునరుద్ధరించాలని, కల్లుగీత సహకార సం ఘాలు టిఎఫ్టిలకు శాశ్వతమైన లైసెన్సు అర్హులైన వారికి గుర్తింపు కార్డులు వృత్తి పరిక రాలు అందించాలని ప్రతి సొసైటీకి టిఎఫ్టిలకు గ్రామాల వారీగా మన పెంపకమునకు 560 జీవో ప్రకారం ఐదు నుండి పది ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని డిమాండ్ నాగభూషణం చేశారు.
తదుపరి సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో గీతా పనివారల సంఘం ను పునర్ నిర్మాణం చేయడానికి అందరూ కృషి చేయాలని బూర్జువా పార్టీలకు,నాయకులకు ఎన్నికలప్పుడే కులసం ఘాలు గుర్తుకు వస్తాయని,ఎన్నికల అనంతరం పట్టించుకోవడం లేదని,వారి సమస్య లు, పెన్షన్లు ,ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో విఫలం అవుతున్నారని అం దుకే గీతా వృత్తిపై ఆధారపడి జీవించే వారంతా ఏకమై జిల్లా కమిటీని వేసుకోవాలని,సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ గీత కార్మికులకు అండగా ఉంటుందన్నారు.
ఈ సమావేశంలో సీనియర్ రాష్ట్ర నాయకులు గొడిసెల తిరుపతి గౌడ్, జిల్లా నాయ కులు పైడిపల్లి రాజు, బండారుపల్లి తిరుపతి, నేరెళ్ల సదానందం, తాళ్ల పెళ్లి చంద్రయ్య, మాదారపు రత్నాకర్,బుర్ర మల్లయ్య, రాము లు బుర్ర అశోక్, రంగు శ్రీనివాస్,కుమార్, మార్క శ్రీకాంత్ మరియు రాజయ్యపాల్గొన్నారు.