11-11-2025 12:00:00 AM
సీడ్ ప్లాంట్ ఎదుట మూడు జిల్లాల రైతుల వంటావార్పు
హుజురాబాద్,నవంబర్10:(విజయక్రాంతి): రైతులకు ధాన్యము డబ్బులు చెల్లించ ని యజమాన్యం చేసేదేమీ లేక సీడ్ కంపెనీ ఎదుట రైతులు ఆర్గనైజర్ ఆధ్వర్యంలో సీడ్ ప్లాంట్ ముందు మూడు జిల్లాలకు చెందిన రైతులు వంటావార్పు చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం, కేశవపట్నంలో సోమవారం చోటుచేసుకుంది.
రైతులు, సీడ్ ఆర్గనైజర్ మాట్లాడుతూ... పా టూరి ఫీడ్ ప్లాంట్ నుండి వీణవంక మండలానికి చెందిన మహిపాల్ రెడ్డి అనే ఆర్గనై జర్ ద్వారా కరీంనగర్ జిల్లా, వీణవంక మం డలంలోని పలు గ్రామాల రైతులు, పెద్దపల్లి జిల్లా లోని పలు మండలాలకు చెందిన రైతులు, జనగామ జిల్లా, సిద్దిపేట జిల్లాలకు చెందిన రైతులు సుమారు 200 మంది రైతులు పాటూరి సీడ్ పంటలు సాగుచేసి పండిన పంటను సీడ్ కంపెనీకి దిగుమతి చేసిన నెలలు గడిచిన నేటికి రైతులకు సు మారుగా 80 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సిన యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతుల గోసనుపట్టించుకోవడంలే దని, పెట్టుబడుల కోసం భార్యల మెడలోని పుస్తెలతాడును కుదువబెట్టి పెట్టుబడులు పెట్టినామని రైతులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు.
సీడ్ కంపెనీ ప్రొడక్షన్ మేనేజర్ ముద్ర కోళ్ల సంపత్ కు కేశవపట్నం పాటూరి సీడ్ కంపెనీ ఉద్యోగులు సమాచారం అం దించడంతో ప్రొడక్షన్ మేనేజర్ సంపత్ ఫో న్ ద్వారా సంప్రదించి వారం రోజుల్లో డ బ్బులు చెల్లిస్తామని ఫోన్లో వివరణవివరణ ఇవ్వగా శశి మీరా అంటూ రైతులు ఒప్పుకోలేదు డబ్బులు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్య వహరిస్తూ మభ్యపెడుతున్నారని రైతులను పట్టించుకోవడంలేదని, మొత్తం రైతులకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించే వరకు కేశవపట్నం పాటూరి సీడ్ ఎదుట వంట వార్పు చేసుకుని నిద్రలు చేస్తూ నిరాహార దీక్షలు చే స్తూ ఉంటామని ధాన్యము డబ్బులు చెల్లించే వరకు పాటూరి సీడ్ ప్లాంట్ నుండి ఎలాం టి దిగుమతి, ఎగుమతులు లేకుండా వంటావార్పులు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. వెంటనే యజమాన్యం స్పందించి రైతులకు రావలసిన డబ్బులు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మూడు జిల్లాలకు చెందిన రైతులు తదితరులుపాల్గొన్నారు.