డాల్ పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకోవాలి
- సౌత్ ఇండియా డాల్ మిల్లర్స్ సభ్యుల వినతి
- హైటెక్ సిటీలోకి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో సమావేశం
హైదరాబాద్, జూన్ ౭(విజయక్రాంతి) : హైటెక్ సిటీ ఇజ్జత్ నగర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఆదివారం సౌత్ ఇండియా డాల్ మిల్లర్స్ సమావేశం జరిగింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన డాల్ మిల్లర్స్ పాల్గొన్నారు.ఎంఎస్‌ఎంఈఎస్ భారత ప్రభుత్వ విధానాలను ఎలా చం పుతున్నాయో, అన్ని అంశాలలో బహుళజా తి కంపెనీలకు కాంట్రాక్టులను ఎలా ఇస్తున్నాయనే దానిపై చర్చ వచ్చింది.
ఈ సందర్భం లో రాష్ట్ర ప్రభుత్వాలు డాల్ పరిశ్రమలకు సహాయం చేయకపోతే మొత్తం పరిశ్రమలు కనుమరుగవుతాయని ఆందోళన వ్యక్తం చే సింది. తెలంగాణ రాష్ట్ర డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. అధ్యక్షుడు కోడుమూరి శ్రీనివాసరావు, ప్ర ధాన కార్యదర్శి శ్రీధర్ బిక్కుమండ్ల, వైస్ ప్రెసిడెంట్ తేరాల ప్రవీణ్, కటకం వీరేందర్, కొల్లిపర ఉదయ్ భాస్కర్, సయ్యద్ మౌలా నా, ఆంధ్ర ప్రదేశ్‌లోని బీదర్, కల్బుర్గి, గడగ్, వినుకొండ, మాచర్ల, తెనాలి , విజయవాడ జిల్లాల మీదుగా బస్వప్రసాద్ ధన్నూర్, చం ద్రశేఖర్ కోబాల్, రాజు గడగ్ పాల్గొన్నారు.






