29-07-2025 01:49:24 AM
బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు..
హస్తిన వేదికగా కేంద్రంపై ఒత్తిడి
పార్టీలకు అతీతంగా ఢిల్లీకి రావాలి
జేఏసీగా ఏర్పడి పోరాడాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాం తి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ని ర్ణయం తీసుకున్నది. ఢిల్లీ వేదికగా కేంద్రం పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోం ది. ఆగస్టు 5, 6, 7తేదీల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్న ది. అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ద్వా రా రాష్ట్రపతికి పంపిన బీసీ బిల్లుకు ఆమో దం తెలపాలని రాష్ట్రపతిని కలిసి ఓవైపు విజ్ఞప్తి చేస్తూనే.. మరోవైపు జంతమంతర్ వద్ద పెద్దఎత్తున ధర్నా చేయాలని రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో దాదాపు 5 గంట లసేపు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగిం ది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అం శంతో పాటు రవాణాశాఖకు సంబంధించి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల ఎత్తివేత, కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాతో పాటు రాష్ర్టం లోని అన్ని మున్సిపల్ కా ర్పొరేషన్లలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై క్యాబినెట్‌లో చర్చించారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఆగస్టు 5న బీసీల రిజర్వేషన్ల బిల్లుల ఆమోదంలో జరుగుతున్న జాప్యానికి నిరసన తెలిపేందుకు పార్లమెంట్‌లో పార్టీ ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఆగస్టు 6న రాష్ర్టంలోని మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర జా ప్రతినిధులందరితో ఛలో ఢిల్లీ కార్యక్ర మం నిర్వహించి జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆగస్టు 7న ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు దాదాపు 200 మంది ప్రతినిధులతో రాష్ర్టపతిని కలిసి బిల్లుల ఆమోదం కోరుతూ వినతిపత్రం అందించాలని నిర్ణయించారు. కాగా, స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలని, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లును ఈ ఏడాది మార్చిలోనే అసెంబ్లీలో రాష్ర్ట ప్రభుత్వం బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే.
మార్చి 17న తెలంగాణ అసెంబ్లీ, మార్చి 18న తెలంగాణ కౌన్సిల్ ఆమోదించిన ఈ రెండు ఈ బిల్లులు మార్చి 22న రాష్ర్ట గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించింది. మార్చి 30న ఈ బిల్లులను గవర్నర్ ద్వారా రాష్ర్టపతి ఆమోదానికి పంపించారు. ఇప్పటికీ ఆ బిల్లులు రాష్ర్టపతి వద్దే పెండింగులో ఉన్నాయి.
బీసీల రిజర్వేషన్ల పెంపు నిర్ణయంపై రాష్ర్టంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ముడిపడి ఉంది. 3 నెలల్లోనే ఎన్నికలునిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన అంశంపై క్యాబినెట్‌లో చర్చ జరిగింది. ఈ నెలాఖరులోపు రిజర్వేషన్ల ప్రక్రి య పూర్తి చేయాలని, అందుకే బీసీల రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీకి వెళ్లి రాష్ర్టపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.
బీసీలకు కేసీఆర్ ద్రోహం చేశారు..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ బీసీలకు తీరని ద్రోహం చేశారని క్యాబినెట్ అభిప్రాయపడింది. అన్ని సామాజికవర్గాల రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదని 2018లో పంచాయతీరాజ్ చట్టంలో ప్రత్యేక నిబంధన పొందుపర్చారని, కేసీఆర్ తెచ్చిన ఈ చట్టం బీసీల రిజర్వేషన్ల పెంపునకు ప్రధాన అడ్డంకిగా మారిందని మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.
కేసీఆర్ బీసీలకు ద్రోహం చే యడం వల్లే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా క బీసీలకు న్యాయం చేసేందుకు జూలై10న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ఆ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. చట్ట సవరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకు రావాలని తీర్మానించి..చట్టంలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ నిబంధనను ఎత్తివేసేలా సవరణ ఆర్డినెన్స్ ఫైల్‌ను జూలై 14న ప్రభుత్వం గవర్నర్‌కు పంపించింది.
ఈ ఆర్డినెన్స్ ఫైలును కూడా గవర్నర్.. రాష్ర్టపతి పరిశీలనకు పంపించిన అంశంపై క్యాబినెట్‌లో చర్చించారు. అందుకే బీసీ రిజర్వేష న్లకు సంబంధించిన రెండు బిల్లులు, ఒక ఆర్డినెన్స్‌ను వెంటనే ఆమోదించాలని రాష్ర్ట క్యాబినెట్ రాష్ర్టపతికి విజ్ఞప్తి చేయటంతో పాటు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో జాతీయ స్థాయిలో అవసరమైన కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం క్యాబినెట్ నిర్ణయించింది.
15 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఎత్తివేత..
ఇక రవాణా శాఖకు సంబంధించి రాష్టంలో ఉన్న అంతర్రాష్ర్ట చెక్‌పోస్టులను రద్దు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ర్ట సరిహదుల్లో మొత్తం 15 చెక్ పోస్టులు ఉన్నాయి. జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా చెక్‌పోస్టులను తొలిగించాలని కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు సూచించింది.
చెక్‌పోస్టులు సిబ్బంది కాకుండా ఇకపై వాహన్, అడ్వాన్డ్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాతో పాటు రాష్ర్టంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు మైక్రో బ్రూవరీస్ చట్టానికి పలు సవరణలు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.