హైదరాబాద్‌లో ‘స్వర్ణ గణపతి’ వైభవం

16-09-2026 | 04:15am

3.83 లక్షల వజ్రాలు, 48 కేజీల స్వర్ణాభరణాలతో మెరిసిపోతున్న గణనాథుడు

హైదరాబాద్ సిటీబ్యూరో 15 (విజయక్రాంతి): ఈ ఏడాది వినాయక చవితి(Vinayaka Chavithi) వేడుకల్లో భాగంగా నగరంలో ఓ ప్రత్యేక గణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. సాధారణంగా మట్టి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను చూసే నగరవాసులకు, బేగంబజార్ పరిధిలోని ఫీల్ఖానాలో కొలువుదీరిన ‘స్వర్ణ గణపతి(Swarna Ganapathi)’ దివ్య దర్శనమిస్తున్నారు. దాదాపు 48 కేజీల బరువుతో రూపొందించిన ఈ విగ్రహానికి 24 క్యారెట్ల బంగారు అలంకరణతో పాటు, సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్ను ఉపయోగించారు.

మహారాష్ట్రలోని ప్రసిద్ధ ’లాల్బాగ్చా రాజా’ రాజసాన్ని, తిరుమల శ్రీ వారి ’బాలాజీ’ అలంకరణ శైలిని కలగలిపి కళాకారులు ఈ విగ్రహాన్ని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచే నగరంలోని వివిధ ప్రాం తాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు ప్రత్యేక క్యూలైన్లు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నాసిక్లో కిలో రూ. 27 వేల ‘గోల్డెన్ మోదక్’....

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని నాసిక్లో 24 క్యారెట్ల తినదగిన బంగారు పూతతో చేసిన ‘గోల్డెన్ మోదకాలు’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యా వికాస్ సర్కిల్లోని సాగర్ స్వీట్స్లో వీటిని కిలో రూ. 27,000 చొప్పున విక్రయిస్తున్నారు. వీటితో పాటు డ్రైఫ్రూట్, కాజు, మలాయ్ వంటి 25కి పైగా రకాల మోదకాలు అందుబాటులో ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. ఒకవైపు హైదరాబాద్లో స్వర్ణ గణపతి, మరోవైపు నాసిక్లో గో ల్డెన్ మోదకాలతో ఈసారి చవితి ఉత్సవాలకు బంగారు కాంతులు తోడయ్యాయి.

మరిన్ని వార్తలు