24 August, 2026 | 11:33 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

జిగ్రీస్ వస్తున్నారు!

29-06-2025 12:00 AM

కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ ఓ యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తోంది. హరీశ్‌రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కృష్ణ వోడపల్లి నిర్మాత. ఈ చిత్రానికి ‘జిగ్రీస్’ అనే టైటిల్‌నున ఖరారు చేశారు. ప్రముఖ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా ఈ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను శనివారం లాంచ్ చేశారు.

ఈ ఫస్ట్‌లుక్, టైటిల్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. చైల్డ్‌హుడ్ ఫ్రెండ్షిప్, నాస్టాల్జియా, క్రేజీ అడ్వెంచర్స్, హిలేరియస్ రోడ్ ట్రిప్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందీ సినిమా. ఈ చిత్రానికి ఈశ్వరాదిత్య డీవోపీగా, కమ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, చాణక్యరెడ్డి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.