29-06-2025 12:00:00 AM
గాలి జనార్ధన్‌రెడ్డి కుమారుడు కిరీటిరెడ్డి ‘జూనియర్’ అనే చిత్రంతో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో జెనీలియా, డాక్టర్ రవిచంద్ర వీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూలై 18న తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. టీజర్ చూస్తే.. యూత్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకోనున్నట్టు తెలుస్తోందీ సినిమా. కథానాయకుడు రిలాక్స్డ్ కాలేజీ కుర్రాడు. మార్కుల కంటే హ్యాపినెస్‌ను ఇష్టపడతాడు. చుట్టూ ఉన్న వారిని ఆకర్షించే వ్యక్తిత్వం ఉన్న అతను శ్రీలీలను ఇష్టపతాడు. మొదట గొడవతో మొదలైన జర్నీ మెల్లాగా ఎట్రాక్టివ్ కెమిస్ట్రీగా మారుతుంది.
టీజర్ చివరలో బాస్ పాత్రతో జెనీలియా డిసౌజా కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. వైవా హర్ష పాత్ర కామిక్ రిలీఫ్‌ను ఇచ్చింది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్; పాటలు: కల్యాణ్‌చక్రవర్తి, శ్రీమణి; మాటలు: కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని; సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్‌కుమార్; ప్రొడక్షన్ డిజైన్: రవీందర్; యాక్షన్ కొరియోగ్రఫీ: పీటర్ హెయిన్; ఎడిటర్: నిరంజన్ దేవరమనే.