గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసిందట!
కొన్ని సినిమాలకు ప్రేక్షకుల ఆద రణ దక్కదు కానీ దానిలోని నటీనటులకు మాత్రం బాగా గుర్తింపు వస్తుంది. అలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రెబా మోనికా జాన్ ఒకరు. ‘సామజవరగమన’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సినిమా అయితే డిజాస్టర్ అనే చెప్పాలి. దీనిలో నటించిన రెబా మోనికాకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఈ సినిమా తర్వాత రెబా ఏ ఒక్క ప్రాజెక్ట్‌లోనూ హీరోయిన్‌గా చేస్తున్నట్టు లేదు. కానీ ఒక సినిమాలో ప్రత్యేక గీతం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ చేసేవారికి ఉన్నంత క్రేజ్ స్టార్ హీరోయిన్స్‌కు కూడా లేదు. అందుకే స్టార్ హీరోయిన్లు సైతం ప్రత్యేక గీతం అనగానే ఏమాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మ్యాడ్ స్కేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. మంచి సక్సెస్ సాధించి ‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చిందట. త్వరలో మేకర్స్ ఒక స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారట. దానిలోనే రెబా మోనికా స్టెప్పులు వేయనున్నారని టాక్.






